ట్రెండింగ్: జూ.పవర్ స్టార్ ప్రకంపనాలు!

  • In Film
  • January 29, 2019
  • 135 Views
ట్రెండింగ్: జూ.పవర్ స్టార్ ప్రకంపనాలు!

టాలీవుడ్ లో నటవారసుల వెల్లువపై ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున వారసుడు అఖిల్ తర్వాత నటసింహా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మోక్షజ్ఞ ఎంట్రీ 2019లో ఖాయం అన్న మాటా వినిపిస్తోంది. అక్కినేని లెగసీని అఖిల్ – నందమూరి లెగసీని మోక్షజ్ఞ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.అయితే వీళ్లందరికీ అదిరిపోయే కాంపిటీషన్ ఎవరి నుంచి ఉండబోతోంది? అంటే .. మరో నటవారసుడు దూసుకొచ్చేస్తున్నాడనే సంకేతం అందుతోంది. అతడి పేరు చెబితేనే మెగా ఫ్యాన్స్ లో ఒకటే ఉప్పెన లాంటి అభిమానం కనిపిస్తోంది. ఇంకా క్యూట్ కిడ్ గా ఉండగానే .. నూనూగు మీసం రాకుండానే.. టీనేజీలో అడుగుపెడుతూనే ఆ యంగ్ బోయ్ కి వీరాభిమానుల్ని – ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడిగా అతడు ప్రకంపనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకీ అతడి పేరును పరిచయం చేయాలా? అంటే పవన్ అభిమానుల కోసం ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. పేరు అకీరా నందన్ కొణిదెల. పవన్ – రేణు దేశాయ్ జంట తొలి సంతానం. కొణిదెల కాంపౌండ్ వారియర్ గా దూసుకొచ్చే యువతరంగం అనే చెప్పాలి.

తాజా సమాచారం