టిఆర్పిలకు గండి కొడుతున్న యాప్స్

  • In Film
  • January 29, 2019
  • 160 Views
టిఆర్పిలకు గండి కొడుతున్న యాప్స్

ఇప్పుడు నిర్మాతలకు సినిమా పరంగా కేవలం శాటిలైట్ హక్కుల రూపంలోనే కాక వివిధ మార్గాల్లో ఆదాయం పెరిగింది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ వీళ్ళ పాలిట వరంగా మారాయి. అమెజాన్ ప్రైమ్ వచ్చాక వీడియో ఎంటర్ టైన్మెంట్ స్వరూపమే మారిపోయింది. అతి తక్కువ సమయంలో సినిమాలను అందుబాటులోకి తీసుకురావడంతో చందాదారులు భారీగా పెరుగుతున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి. అయితే ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా ఛానల్స్ టిఆర్పి రేటింగ్ మీద ప్రభావం చూపడం పట్ల కొత్త ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే ఓ ఛానల్ లో జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ టెలికాస్ట్ అయ్యింది. దానికి భారీ రేటింగ్స్ ఆశించిన యాజమాన్యం 15 లోపే రావడం చూసి ఖంగు తింది. దానికి కారణం ఆరాతీస్తే ప్రసారానికి పది రోజుల ముందే తమ స్వంత స్ట్రీమింగ్ యాప్ లో ఆ సినిమాను అందుబాటులో ఉంచడం వల్ల ప్రీమియర్ షో డేట్ వచ్చే లోపే అది ఎందరికో చేరిపోయింది. వివిధ మార్గాల్లో దాని హెచ్డి ప్రింట్ ప్రేక్షకులు చూసేసారు. టీవీలో వచ్చినప్పుడు యాడ్స్ తో ఏం చూస్తాంలే అని లైట్ తీసుకున్నారు. సరిగ్గా ఇలాగే అదే ఛానల్ లో వచ్చిన శైలజారెడ్డి అల్లుడుకు ఇలాగే జరగడం గమనార్హం.ఈ ట్రెండ్ గత ఏడాది నుంచే ఊపందుకుంది. ఇప్పటిదాకా హయ్యెస్ట్ రేటింగ్స్ సాదించిన బాహుబలి 2-మగధీర సినిమాలను ఏవి అధిగమించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పొచ్చు. భరత్ అనే నేను-ఖైది నెంబర్ 150-గౌతమిపుత్ర శాతకర్ణి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని అద్భుతాలు చేసినా టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఆ మేజిక్ చూపించలేదు. అప్పటికే ఇవి యాప్స్ లో అందుబాటులోకి రావడమే కారణం. అమెజాన్ ప్రైమ్ మరీ దూకుడుగా ఈ మధ్య నెల రోజుల్లోపే కొత్త సినిమాలు పెట్టేస్తోంది. పడి పడి లేచే మనసు-అంతరిక్షంలు టీవీలో ఎప్పుడు వస్తాయో తెలియదు కాని అప్పుడే లక్షల్లో వీటిని చిన్నితెరలపై చూసేసారు. మరి అలాంటప్పుడు టిఆర్పిపై ప్రభావం ఉండకుండా ఎలా ఉంటుంది. అయితే ఈ విషయంలో శాటిలైట్ ఛానల్స్ కూడా ఏమి చేయలేని పరిస్థితి. తమ కన్నా చాలా పెద్ద మొత్తంలో డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ హక్కులు కొంటున్నప్పుడు అడ్డుకోవడం జరిగే పనేనా చూస్తూ ఉండటం తప్ప.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos