చైనా వృద్ధి రేటు 6.6శాతం

చైనా వృద్ధి రేటు 6.6శాతం


బీజింగ్‌ : ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్టమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ 2018లో 6.6శాతం వృద్ధి సాధించింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా 6.5శాతం వృద్ధి రేటును లక్ష్యంగా ప్రకటించింది. ఆ లక్ష్య్నాన్ని ఇప్పుడు అది అధిగమించినట్లు జాతీయ గణాంకాల బ్యూరో (ఎన్‌బిఎస్‌) సోమవారం తెలిపింది. 2017లో నమోదైన 6.8శాతం కన్నా ఇది తక్కువే. గతేడాది మూడవ త్రైమాసికంలో 6.5శాతం నమోదు కాగా, నాల్గవ త్రైమాసికానికి అది 6.4శాతానికి తగ్గింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో చైనా వాటా దాదాపు 30శాతం దాకా వుంది. ఇప్పటికీ ఇతర దేశాలన్నిటి కన్నా చైనా వాటానే అధికంగా వున్నట్లు ఎన్‌బిఎస్‌ తెలిపింది. 2018లో చైనా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 90 లక్షల కోట్ల యువాన్లు వుండగా ఇందులో సేవా రంగం వాటానే సగానికన్నా ఎక్కువగా వుంది. చైనాలో దేశీయ డిమాండ్‌ బలోపేతమవుతోంది. వినిమయం గతేడాది జిడిపిలో 76.2శాతంగా వుంది. రిటైల్‌ అమ్మకాలు గతేడాది కన్నా 9శాతం పెరిగాయి. పారిశ్రామిక ఉత్పత్తి 6.2శాతం పెరిగింది. వినిమయ ధరల సూచీ 2.1శాతం పెరిగాయి. ఉపాధి మాత్రం స్థిరంగా వుంది. గతేడాదిలో పట్టణ ప్రాంతాల్లో కోటీ 30లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించారు. డిసెంబరులో పట్టణ నిరుద్యోగ రేటు 4.9శాతంగా వుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos