చీప్ గా పాల దొంగతనం చేస్తున్న ఫ్యాన్స్!

  • In Film
  • January 25, 2019
  • 750 Views
చీప్ గా పాల దొంగతనం చేస్తున్న ఫ్యాన్స్!

రెండు రోజుల క్రితం తమిళ హీరో శింబు తన కొత్త సినిమా విడుదల రోజు కటౌట్లకు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇది అక్కడ పెద్ద దుమారమే రేపుతోంది. పాల ఉత్పత్తిదారులు ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అసలు ఇలా సినిమా హీరోల కట్ అవుట్లకు పాలాభిషేకాలు లేకుండా నిషేధం విధించాలని కోర్ట్ లో కేసు వేసే ఆలోచనలో కూడా ఉన్నారు. నిజానికి ఈ విషయంలో తమిళ తంబీల ఫ్యాన్స్ కాస్త అతిగానే ఉంటారు. అయితే శింబు వ్యక్తి గతంగా ఇలా పిలుపు ఇవ్వడమే గొడవ ముదిరేలా చేస్తోంది.

ఇప్పుడీ వ్యవహారం మరో కొత్త తలనెప్పి తెచ్చి పెట్టింది. అదేంటంటే పాల ప్యాకెట్ల దొంగతనాలు. అవును నిజం. ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్నదే కానీ శింబు పిలుపు నేపథ్యంలో ఇవి ఇంకా ఎక్కువయ్యాయని పాల సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్రక్కుల్లో వేలాది ప్యాకెట్లు తెచ్చి దుకాణాలకు అర్ధ రాత్రే సప్లై చేస్తామని వాళ్ళు తెల్లవారుఝామున మూడు గంటలకే వాటిని బాక్సుల్లో సర్దుకుని అమ్ముతారని అయితే దీన్ని అవకాశంగా వాడుకుని హీరోల ఫ్యాన్స్ పాల ప్యాకెట్లను దొంగతనం చేస్తున్నారట.కొన్ని చోట్ల ఏకంగా బెదిరించి మరీ ఎత్తుకు పోతున్నారట. ఇంత చేస్తోంది తాగడానికో పంచడానీకో అయితే సంతోషమే. కటౌట్లకు మొత్తం నేలపాలు చేయడమే వీళ్ళ ఉద్దేశం. శింబు సినిమా రిలీజ్ కు ఇంకా వారం వ్యవధి ఉన్నప్పటికీ ఇప్పటికే చోరీలు షురూ అయ్యాయట. ఎలాగూ పారబోసే పాలే కాబట్టి ముందే దాచి ఉంచుకుని రిలీజ్ రోజు  బయటికి వచ్చి హీరో బొమ్మ మీద కుమ్మరిస్తారు. ఆ పాలు కుళ్లిపోయినా విరిగిపోయినా సమస్య ఉండదు. అయినా ఈ పిచ్చి ఏంటో కానీ ప్రజల కనీస అవసరమైన పాలను ఇలా దొంగిలించి మరీ హీరోలకు అభిషేకం చేయడంలో ఆనందం ఏమిటో వారికే తెలియాలి

తాజా సమాచారం