చరిత్రలో నిలిచిపోయే రోజు: చంద్రబాబు

చరిత్రలో నిలిచిపోయే రోజు: చంద్రబాబు

అమరావతి: నిన్నజరిగిన ఏపీ శాసనసభ చరిత్రలో నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. శనివారం ఉదయం ఆయన టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ని ర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జేఏసీ బంద్ విజయవంతమైందని అన్నారు. అన్యాయాన్ని నిలదీసేందుకే ఈ తీవ్ర నిరసనలని ఆయన అన్నారు. చివరి బడ్జెట్‌లో కూడా ఏపీకి బీజేపీ ద్రోహమే చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రబడ్జెట్‌తో సామాన్యులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. నరేగాలో రాష్ట్రాన్నే అప్పు తెచ్చుకోమన్నారని, బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్యను ప్రస్తావించలేదన్నారు. రాష్ట్రంలో 14లక్షల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. బీజేపీ వైఫల్యం వల్లే దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదల జీవితాల్లో మరో సంక్రాంతి పించన్ల పండుగని చంద్రబాబు అన్నారు. 54 లక్షల మంది పించన్లకు రూ.14వేల కోట్లు, పసుపు కుంకుమ కింద 94 లక్షల మహిళలకు రూ.10వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం కోటి 48 లక్షల మందితో మమేకమయ్యే పండుగ ఇదని అన్నారు. పించన్లు, పసుపు కుంకుమ అనగానే టీడీపీ గుర్తుకురావాలని చంద్రబాబు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos