చంద్రబాబు బయోపిక్ వస్తోంది.. కాచుకోండిక!

  • In Film
  • February 9, 2019
  • 112 Views
చంద్రబాబు బయోపిక్ వస్తోంది.. కాచుకోండిక!

ఎప్పుడో మూడేళ్ల కిందటే షూటింగ్ ప్రారంభం అయిన చంద్రబాబు నాయుడి బయోపిక్ ‘చంద్రోదయం’ విడుదలకు సన్నద్ధం అవుతోందట! అందుకు సంబంధించి విడుదల తేదీని కూడా ప్రకటించారు. మార్చి పదో తేదీన ఈ సినిమా విడుదల కాబోతోందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లూ గట్రా విడుదల అయ్యాయి!ఈ సినిమాను ఎందుకు తీశారో తెలియడం లేదు కానీ.. అందులో చంద్రబాబు పాత్రధారి వేషధారణ మాత్రం ప్రహసనం పాలయ్యింది. పెరుగన్నం తిని మూతి తుడుచుకోని వ్యక్తి వలె ఉన్న ఆ గెటప్ తో సినిమా ఏమిటో ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.మరి ఈ సినిమా పట్ల చంద్రబాబు అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమా విడుదలకు భారీగా ఏర్పాట్లు చేసి.. ర్యాలీలు గట్రా నిర్వహించి.. సినిమాను సూపర్ హిట్ చేసేందుకు చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రెడీ అయిపోవాల్సి ఉంది. ఈ సినిమా మేకింగ్ కు బాహుబలి మేకింగ్ కన్నా ఎక్కువ సమయమే తీసుకున్నారు. మరి ఔట్ పుట్ ఆ రేంజ్ లో ఉంటుందో!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos