చంద్రబాబుకు హ్యాట్సాప్‌ చెప్పిన జేసీ

చంద్రబాబుకు హ్యాట్సాప్‌ చెప్పిన జేసీ

అనంతపురం : ఏ ముఖ్యమంత్రీ అమలుచేయని విధంగా చంద్రబాబునాయుడు 112 సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసు కొచ్చారని, కరువు సీమగా పేరొందిన రాయల సీమకు నీళ్లందించి రత్నాల సీమగా మారుస్తున్నారని, ముఖ్యమంత్రికి హ్యాట్సాఫ్‌ అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాయల చెరువు గ్రామంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ జేసీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే అని, మరో ఐదు సంవత్సరాలు చంద్రబాబునాయుడుకు అధికారం అప్పగిస్తే రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలబడుతుందని తెలిపారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నాయకులకు కులాన్ని అంటగట్టి ఓట్లు వేస్తున్నారని, ప్రజలందరూ కలిస్తేనే ప్రభుత్వమని తెలిపారు. ఎవరి స్వార్థం కోసమో కాకుండా మీకోసం, జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు తాగునీరు వస్తుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషితో అటు వంటి ప్రాంతాలకు కూడా తాగునీరు అందిందని ఆయన తెలిపారు. అభివృద్ధి, అక్షరాస్యతను, ప్ర భుత్వాలను బట్టే జరుగుతుందని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం జన్మభూ మి-మాఊరు కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు.
డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఆర్‌డీఏ ద్వారా జిల్లా అంతటా డ్రిప్‌ పరికరాలు పంపిణీ చేశామని, బోరుబావి ఉన్న ప్రతి రైతుకు డ్రిప్‌ పరికరాల మంజూరు జరిగిందని తెలిపారు. ఉ పాధి అవకాశాలు పెంపొందించడానికి యువనే స్తం పథకం ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రో గ్రాంలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరి శ్రమలశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజు మా ట్లాడుతూ నియోజకవర్గంలోని భోగసముద్రం వద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్కు నిర్మాణానికి స న్నాహాలు జరుగుతున్నాయని, ఉపాధి అవకా శాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు.
పెళ్లికానుకలు, ఇళ్లపట్టాలు అందజేత
జన్మభూమి కార్యక్రమంలో చంద్రన్న పెళ్లికా నుక కింద పలువురు వధూవరులకు ఎమ్మెల్యే అందచేశారు. ప్రజలకు చంద్రన్న సంక్రాంతి కానుకలను, హౌసింగ్‌ లబ్ధ్దిదారులకు ఇళ్ల మం జూరు పట్టాలను అందచేశారు. రైతులకు రైతు రథం ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ వేలూరు రంగయ్య, టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్వీ రవీంద్రారెడ్డి, మండల టీడీపీ నాయకుడు బాలారమేష్‌బాబు, మండల కన్వీనర్‌ అనిల్‌కుమార్‌, రాయల చెరువు ఎంపీటీసీ సభ్యురాలు గురుపాదమ్మ, మాజీ సర్పంచ్‌ గోపాల్‌నాయుడు, మాజీ మండల కన్వీనర్‌ విజయనాయుడు, నాయకులు నాగమునిరెడ్డి, నరసింహులు, సుధాకర్‌నా యుడు, చరణ్‌, మలమంచి శివ, శేఖర్‌, సుధా కర్‌రెడ్డి, బాబు, రమేష్‌, కుమార్‌, ఇన్‌చార్జ్‌ ఎం పీడీఓ అనిల్‌కుమార్‌, తహసీల్దార్‌ బ్రహ్మయ్య, ఐసీడీఎస్‌ సీడీపీఓ శశికళ, ఏపీఎం హేమలత, ఏపీఓ మద్దిలేటి, హౌసింగ్‌ ఏఈ రంగనాయ కులు, ఎంఈఓ కాశప్ప పాల్గొన్నారు.
తాడిపత్రి: తాడిపత్రి ప్రాంతంలోని 1500 మంది చిరువ్యాపారులకు రుణసౌకర్యం క ల్పించి ఆదుకుంటామని ఎమ్మెల్యే తనయుడు జేసీ అశ్మిత్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని 26, 36 వార్డులకు సంబంధించి వైఎస్సార్‌ ఫంక్ష న్‌హాల్‌, గాజులకిష్టప్ప వీధిలోని సత్యనారా యణస్వామి ఆలయం వద్ద గురువారం జన్మ భూమి-మాఊరు కార్యక్రమాలు జరిగా యి. ఈ సందర్భంగా జేసీ అశ్మిత్‌రెడ్డి మాట్లాడు తూ పట్టణంలోని చిరువ్యాపారులు వడ్డీవ్యా పారులో కబందహస్తాలో చిక్కుకొని అల్లాడి పోతున్నారన్నారు. వారందరినీ ఆదు కునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు కల్పిం చనున్నామన్నారు.
అర్హులైనవారందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటలక్ష్మి, వైస్‌చైర్మన్‌ జిలాన్‌బాషా, కమీషనర్‌ శివరామ క్రిష్ణ, మున్సిపల్‌ ఏఈ రాచయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నరసింహారెడ్డి, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ తిరుపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం