ఖాకి దుస్తుల్లోకి మారిన కామ్రేడ్

  • In Film
  • January 29, 2019
  • 134 Views
ఖాకి దుస్తుల్లోకి మారిన కామ్రేడ్

విజయ్ దేవరకొండ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’  సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే కంప్లీట్ చేసిన విజయ్ తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ చేస్తున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ విజయ్ నెక్స్ట్ సినిమాకు దర్శకుడు.  ఇదిలా ఉంటే ఈమధ్య విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో విజయ్ ఖాకీ దుస్తుల్లో కార్మికుడిలా ఉన్నాడు. మీసాలు పెంచి గెడ్డం షేవ్ చేసుకొని  ఉన్న విజయ్ గెటప్ కూడా కొత్తగా ఉంది.దీంతో ఈ గెటప్ ఏ సినిమాలోది అని విషయంలో చర్చలు మొదలయ్యాయి.  ఈ గెటప్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోది అయి ఉండొచ్చని.. టైటిల్ లో కూడా కామ్రేడ్ ఉంది కదా దానికి తగ్గట్టే కార్మిక నాయకుడిలా కనిపిస్తున్నాడని కొందరు అంటున్నారు.  కానీ ‘డియర్ కామ్రేడ్’ లో విజయ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. పైగా ఆ సినిమాలో విజయ్ పోషించేది విద్యార్థి నాయకుడి పాత్ర.  అందుకే ఈ లుక్ క్రాంతి మాధవ్ సినిమా కోసం అయి ఉంటుందని కొందరు గెస్ చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం అయిందో లేదో అధికారికంగా సమాచారం లేదు. అయినప్పటికీ ఈ సినిమా కథ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతుందని.. విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ కార్మిక నాయకుడిగా కనిపిస్తాడనే స్పెక్యులేషన్స్ మాత్రం మొదలయ్యాయి. 
ఒకవేళ అదే నిజమైతే విజయ్ దేవరకొండ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నట్టే.  విజయ్ – క్రాంతి మాధవ్ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తారు.

తాజా సమాచారం