కోదండరాముడికి అడుగడుగునా అవాంతరాలు!

కోదండరాముడికి అడుగడుగునా అవాంతరాలు!

చెన్నై: బెంగళూరులోని ఈజిపురా ప్రాంతంలో ప్రతిష్టించేందుకు గాను భారీ కంటైనర్‌ లారీలో పయనమైన కోదండరాముడి విగ్రహానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ లారీలోని 15 టైర్లు హఠాత్తుగా పంక్చర్‌ కావడంతో అమ్మా పాళయం వద్ద ఆగిపోయింది. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంకోరకోట్టైలో ఏక శిలపై చెక్కిన శ్రీకోదండరాముడి విగ్రహాన్ని బెంగళూరుకు తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. 64 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పు కలిగిన ఆ బ్రహ్మాండమైన విగ్రహాన్ని 240 టైర్లు కలిగిన భారీ కంటైనర్‌లో తరలించాలనుకున్నారు. డిసెంబర్‌ ఏడున విగ్రహంతో లారీ బెంగళూరుకు బయల్దే రింది. పలు ఆటంకాలను అధిగమించి తిరువణ్ణా మలై చేరింది. రెండు రోజుల క్రితం తిరువణ్ణా మలై గిరి ప్రదక్షిణ మార్గంలో ఆ కంటైనర్‌ లారీ పయనమైంది.దిండివనం బెంగళూరు జాతీయ రహదారిమీదుగా ఆ విగ్రహంతో లారీ మంగళవారం రాత్రి ఏడుగంటలకు సెంగం సమీపం అమ్మా పాళయం గ్రామాన్ని చేరుకుంది. అక్కడ నిలిచిన అతిపెద్ద కోదండరామస్వామి విగ్రహాన్ని తిలకిం చేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అనంతరం బుధవారం ఉదయం అమ్మాపాళయం నుంచి కాసేపట్లో లారీ బయలుదేరనున్న సమయంలో ఉన్నట్టుండి ఒకేసారి 15 టైర్లు పంక్చరైనట్లు డ్రైవ ర్లు, క్లీనర్‌లు గుర్తించారు. కొత్త టైర్లు బిగించేం దుకు సన్నాహాలు ప్రారంభమయ్యారు. ఆ కంటై నర్‌ లారీకి అనువైన టైర్లు అహ్మదాబాద్‌ నుంచి రావాల్సి ఉంది. టైర్లు అక్కడి నుంచి చెన్నైకి తీసకు వచ్చి, అమ్మాపాళయానికి తరలించేందుకు కనీసం రెండు మూడు రోజులు పడుతుంది. అంత వర కూ ఆ విగ్రహమున్న కంటైనర్‌ లారీ అమ్మాపాళ యంలోనే ఉంటుంది. అంత వరకు ఆ విగ్రహాన్ని కాపాడేందుకు స్థానిక పోలీసులు భద్రతా ఏర్పాట్లు సైతం చేపట్టారు. కొత్త టైర్లు బిగించిన తర్వాత ఆ లారీ కోననకుట్టై గేట్‌, కరియమంగళం, కొట్టకుళం, మన్‌మలై గ్రామాల మీదుగా సెంగం ప్రాంతానికి చేరుకోవాల్సి వుంది.అక్కడి నుండి మళ్లీ బెంగ ళూరుకు ఆ భారీ విగ్రహం పయనమవుతుంది. ప్రస్తుతం సెంగం వరకు ఉన్న 18 కిలోమీటర్ల రహదారి మిట్ట పల్లాలుగా ఉండటంతో ఆ విగ్ర హాన్ని తరలించే టప్పుడు కంటైనర్‌ లారీ కదలక మొరాయిస్తుందే మోనని లారీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కోదండ రాముడి విగ్రహం తిరువణ్ణామలై జిల్లా సరిహద్దు దాటడానికి కనీసం పది రోజులు పడుతుందని చెబుతున్నారు. ఆ లోగా ముప్పై కిలోమీటర్ల మధ్యలో ఉన్న మూడు వంతెనలను దాటుకుని ఆ విగ్రహం గమ్యస్థానం వైపు బయలుదేరాల్సి ఉంది. ఆలోగా ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయోనని విగ్రహ తరలింపు పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos