కేజ్రీవాల్ తో పొత్తుపై షీలాదీక్షిత్ స్పందన

రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయమై ఆప్ అధినేత కేజ్రీవాల్ తో ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తెలిపారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఈరోజు ఆమె బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, రాజకీయాలు పూర్తి సవాళ్లతో కూడుకున్నవని చెప్పారు. బీజేపీ, ఆప్ కూడా తమకు సవాళ్లేనని… వాటిని ఎదుర్కొంటామని తెలిపారు. ఇప్పటివరకైతే ఆప్ తో పొత్తు లేదని… రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలని అన్నారు.

మరోవైపు డీపీసీసీ అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్ బాధ్యతలను స్వీకరించనుండటంతో ఇరు పార్టీల మధ్య పొత్తుకు మార్గం సుగమమైనట్టేనని ఆప్, కాంగ్రెస్ వార్గాలు చెబుతున్నాయి. ఆప్ తో పొత్తును కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ వ్యతిరేకించారు. దీంతో, అతని స్థానంలో షీలా దీక్షిత్ ను డీపీసీసీ అధ్యక్షురాలిగా నియమించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos