వాజపేయి, ఎన్టీఆర్ ను వంచించిన బాబు

వాజపేయి, ఎన్టీఆర్ ను వంచించిన బాబు

రాజమహేంద్ర వరం:దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావును ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని మోదీని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని  దుయ్యబట్టారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన క్వారీ మార్కెట్‌  వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత లాలాచెరువు వద్ద జరిగిన ఉభయ గోదావరి జిల్లాల భాజపా పదాధికారుల సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచకు పడ్డారు చంద్రబాబు, జగన్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కాదని, మోదీతోనే అది సాధ్యమన్నారు.  పోలవరం జలాశయ నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన నిధుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగమింగుతోదని భాజపా ‘‘చంద్రబాబు దిల్లీ, కోల్‌కతా వెళ్లి ధర్నాలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో కలసి తెలంగాణలో మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతి,  పోలవరానికి మేం ఇచ్చిన నిధుల్ని  ఇక్కడి ప్రభుత్వం దాని కోసమే ఖర్చు  చేయకుండా భారీ అవినీతికి పాల్పడింది’అని ఆరోపించారు. ‘విభజన చట్టంలోని అంశాలను 90 శాతం నెరవేర్చాం. ఐదేళ్లలో 20 ప్రతిష్ఠాత్మక సంస్థలను రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రూ.180 కోట్లు ఇచ్చాం. గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. కోస్తా ప్రాంతంలో రూ.55,475 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోంది’’ అని ఏకరువు పెట్టారు.  రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పార్టీలు అని విమర్శించారు. పుల్వామా ఉగ్రదాడిని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.  సైనికులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు .‘గత ఐదేళ్లలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. భారత సైనికులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రదాడిని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేయాలని చూస్తోంది. చంద్రబాబుకు పాకిస్థాన్‌ ప్రధానిపై భరోసా ఉంది గానీ, మన ప్రధానిపై లేదు. రాజకీయాలకు కూడా హద్దు ఉండాలి. సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మోదీ వ్యవహరిస్తున్నారు’’ అని విరుచుకు పడ్డారు.

తాజా సమాచారం