ఓన్లీ కాన్ఫిడెన్సా?ఓవర్‌ కాన్ఫిడెన్సా?

  • In Film
  • February 8, 2019
  • 113 Views
ఓన్లీ కాన్ఫిడెన్సా?ఓవర్‌ కాన్ఫిడెన్సా?

గత ఏడాది దిల్ రాజుకు నిరాశను మిగిల్చింది. శతమానంభవతి స్థాయిలో ఆశలు పెట్టుకుని నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం మరీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దాంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా గత ఏడాది దిల్ రాజుకు నష్టాలను మిగిల్చాయి. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే దిల్ రాజు ‘ఎఫ్ 2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు. అది కూడా మామూలు బ్లాక్ బస్టర్ కాదు ఆయన బ్యానర్ లోనే టాప్ చిత్రాల జాబితాలో ఎఫ్ 2 నిలిచింది. దాంతో ఈ సంవత్సరం అంతా కూడా మళ్లీ తాను హవా కొనసాగిస్తాననే నమ్మకంతో దిల్ రాజు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘మహర్షి’.

మహేష్ బాబు 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెలతో పూర్తి కాబోతుంది. ఏప్రిల్ చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంకు అన్ని ఏరియాల్లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఇదే సమయంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమాపై మరింత నమ్మకంను పెంచుతున్నాయి. తాజాగా దిల్ రాజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మిస్తున్నాను. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకుంటాయన్నాడు.’96’ రీమేక్ తో పాటు మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను దిల్ రాజు వ్యక్తం చేశాడు. మామూలుగా ఏ సినిమాను అయినా సక్సెస్ అవుతుందనే ఆయా చిత్రాల నిర్మాతలు చెప్పుకుంటారు. కాని దిల్ రాజు ఇతర సినిమాల విషయంలో మరీ అతిగా స్పందించడు. కాని మహర్షి విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడు. మరి ఇది కాన్ఫిడెన్సా? లేదా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది చూడాలి. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos