ఐదేళ్లలో 835 ప్రైవేటు కాలేజీల మూత

  • In Local
  • January 21, 2019
  • 797 Views
ఐదేళ్లలో 835 ప్రైవేటు కాలేజీల మూత

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2018 వరకు రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ నుంచి పీజీ వరకు 835 ప్రైవేటు కాలేజీలు మూతపడ్డాయి. వీటిలో 228 డిగ్రీ, 149 ఇంజనీరింగ్‌, 176 ఎంటెక్‌ కాలేజీలు ఉన్నాయి. 117 ఎంబీఏ, 60 బీఈడీ కాలేజీలు ఉన్నాయి. 2014-15 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 3,351 ప్రైవేటు కాలేజీలు ఉండగా 2018-19లో వాటి సంఖ్య 2,516కు తగ్గడం గమనార్హం. అయితే ఒకవైపు భారీ సంఖ్యలో కాలేజీలు మూతపడినా మరోవైపు సీట్ల సంఖ్య పెరిగింది. 2014-15లో 5,23,291 సీట్లు ఉండగా 2018-19లో 6,52,178 సీట్లకు పెరగడం గమనార్హం. అంటే 1,28,887 సీట్లు పెరిగాయి. అడ్మిషన్ల సంఖ్య కూడా పెరిగింది. 2104-15లో 3,77,344 సీట్లు భర్తీ కాగా 2018-19లో 397225 సీట్లు భర్తీ అయ్యాయి. అదనంగా 19,881 సీట్లు భర్తీ అయినట్టు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటి నుంచి ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీలకు అనుమతి నిరాకరించింది. సీట్లు భర్తీ కాకపోవడంతో పలు యాజమాన్యాలు స్వచ్చందంగానే కాలేజీలు మూసివేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos