ఐటీసీ జోరు.. షేరు కొనొచ్చా?

  • In Money
  • January 11, 2019
  • 782 Views
ఐటీసీ జోరు.. షేరు కొనొచ్చా?

ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ శుక్రవారం ట్రేడింగ్ సమయంలో 2 శాతం మేర పెరిగింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ తాజాగా ఐటీసీ స్టాక్‌కు కాల్ రేటింగ్ కొనసాగించింది. టార్గెట్ ప్రైస్‌ను రూ.390 నుంచి రూ.400లకు పెంచింది. పొగాకుపై పన్ను స్లాబ్‌లలో ఎలాంటి నిర్ణయం లేకపోవడం కారణంగా టార్గెట్ ప్రైస్ పెంచినట్లు సీఎల్ఎస్ఏ తెలిపింది. ప్రస్తుత రూ.400 టార్గెట్ ప్రైస్‌ను గమనిస్తే.. గురువారం నాటి ఐటీసీ స్టాక్ క్లోజింగ్ ధరతో పోలిస్తే దాదాపు 38 శాతం పెరుగుదల ఉంటుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. గత 18 నెలలో జీఎస్‌టీ కౌన్సిల్ 13 సార్లకుపైగానే సమావేశమైందని, అయితే పొగాకుపై పన్ను విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. వచ్చే కొద్ది నెలలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, అందువల్ల జీఎస్‌టీ స్లాబ్‌లలో మార్పలు ఉండకపోవచ్చని అంచనా వేసింది.
ఐటీసీ స్టాక్ విషయంలో రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఆకర్షణీయంగా ఉందని సీఎల్ఎస్ఏ పేర్కొంది. స్టాక్ ధర పడిపోవడానికి పెద్దగా అవకాశాలు కనిపించడం లేదని తెలిపింది. ఐటీసీ షేరు ధర గత 9 నెలల కాలంలో 10 శాతానికి పైగా పెరిగిందని గుర్తు చేసింది.ఐటీసీ స్టాక్ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో 1.59 శాతం పెరుగుదలతో రూ.294 వద్ద ట్రేడయ్యింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos