ఉందిలే మంచికాలం మార్చి 1 న!

  • In Film
  • January 29, 2019
  • 738 Views
ఉందిలే మంచికాలం మార్చి 1 న!

ఏ రంగంలోనైనా మన గురించి మాట్లాడేది విజయమే. సినిమా రంగంలో అది ఇంకా ముఖ్యం.  విజయాల శాతం చాలా తక్కువగా ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో ఫెయిల్యూర్లు ఎక్కువగా ఉంటే కెరీరే స్మాష్ అయిపోతుంది.   బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ విషయమే తీసుకుంటే అమెకు అవకశాలు ఫుల్లుగానే ఉన్నాయి గానీ విజయం మాత్రం పాపతో దోబూచులాడుతూ ఉంది.

తెలుగులో రెండు సినిమాలు చేస్తే రెండూ ఫెయిల్యూర్లే.  ఇక హిందీ లో ‘హీరోపంటి’.. ‘బరేలీ కీ బర్ఫీ’ లాంటి సినిమాలు ఓ మోస్తరుగా మెప్పించాయిగానీ సాలిడ్ హిట్లయితే మాత్రం కాదు.   చాలా రోజుల నుండి ఈ బ్యూటి ఒక మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉంది.  కృతి తాజా చిత్రం ‘లుక్కా చుప్పి’ మార్చి 1 న రిలీజ్ అవుతోంది.  ఈ సినిమాపై కృతి కాన్ఫిడెంట్ గా ఉంది.  కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రోమోలు ఇప్పటికే ఆసక్తి కలిగిస్తున్నాయి.   హీరో హీరోయిన్ లు లివిన్ రిలేషన్ లో ఉండాలని అనుకోవడం..  కానీ ఇద్దరు మాత్రమే కాకుండా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఈ భార్యాభర్తల ముసుగులో ఈ లివిన్ రిలేషన్ కొనసాగించడం.. అందులో కష్టాలు.. ఇలా ఫన్నీగా సాగుతుంది ఈ కథ.

సినిమా కంటెంట్ చూస్తుంటే ప్రేక్షకులను మెప్పించేదిగానే ఉంది.  కామెడీతో పాటుగా కృతి కూడా గ్లామర్ బాగానే ఒలకబోసింది.   మరి ఈ సినిమా కృతి కరువు కాలాన్ని తీర్చేసి ఒక మంచి హిట్ ఇస్తుందా లేదా అనేది మార్చి 1 న తెలుస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos