ఇంద్రా నూయీ ప్రపంచ బ్యాంకు చీఫ్ కాబోతున్నారా?

  • In Money
  • January 16, 2019
  • 746 Views
ఇంద్రా నూయీ ప్రపంచ బ్యాంకు చీఫ్ కాబోతున్నారా?

న్యూయార్క్ : పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయీ ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవి రేసులో ఉన్నారు. ప్రముఖ అమెరికన్ దిన పత్రిక కథనం ప్రకారం ఇంద్రా నూయీ పేరును వైట్ హౌస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంద్రా నూయీ 12 ఏళ్ళపాటు పెప్సీకోలో సేవలందించారు. ప్రస్తుతం ఆమె వయసు 63 సంవత్సరాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవికి ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పదవికి ఇంద్రా నూయీని ఎంపిక చేయడంపై ఇవాంక పరిశీలిస్తున్నారని అమెరికా మీడియా తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఇదిలావుండగా ఇంద్రా నూయీని ఒకవేళ ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవికి ఎంపిక చేసినా, ఆమె ఆ పదవిని చేపట్టేందుకు అంగీకరిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదని అమెరికన్ మీడియా పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos