ఆ నీళ్లు పోతే పోనీ:పాక్

ఆ నీళ్లు పోతే పోనీ:పాక్

ఇస్లామాబాద్‌: పుల్వామా దాడికి ప్రతీకారంగా  వాటా జలాల్లో మిగులును భారత్‌  మళ్లించుకున్నంత మాత్రాన తమకు నష్టం లేదని, ఎలాంటి ఆందోళనా చెందడం లేదని పాక్‌ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఖవాజా షుమాలి అన్నారు. పాక్‌  పత్రిక – డాన్‌తో దీని గురించి  ఆయన మాట్లాడారు.‘‘తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరమూ, ఆందోళనా లేదు. భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల మేమేమీ చింతించటం లేదు. మా వాటాగా దక్కిన సింధు, జీలం, చీనాబ్‌ నదీ జలాల నీటిని అడ్డుకుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అభ్యంతరం వ్యక్తం చేస్తాం. ఆరో దశకంలో కూడా తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించుకున్నారు. దాన్ని మేమేమీ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. మాకే ఇబ్బంది లేదు’’ అని ఆయన అన్నారు.సింధూ జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాక్‌కు దక్కగా, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌కు దక్కాయి. పుల్వామా దాడి వల్ల మన  దేశ తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలువరించి జమ్ము-కశ్మీర్‌, పంజాబ్‌ ప్రజలకు అందిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos