ఆ చెత్త వీడియోలు నాకు పంపించారు

  • In Film
  • January 29, 2019
  • 821 Views
ఆ చెత్త వీడియోలు నాకు పంపించారు

ఈమద్య కాలంలో సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా సంచలనంగా మారిపోయింది. వరుసగా ఈమె ఏదో ఒక విషయమై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమద్య తమిళ లెజెండ్రీ రచయిత వైరముత్తు పై సంచలన లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత ఈమె డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తొలగించబడింది. దాంతో అప్పటి నుండి కూడా తనకు జరిగిన అన్యాయంను సోషల్ మీడియా ద్వారా చెబుతూ వస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే చిన్మయి అభిమానుల కామెంట్స్ కు స్పందిస్తూ ఉంటుంది.

తాజాగా ఒక అభిమాని ట్విట్టర్ లో మీరు చీర కట్టుకోవచ్చు కదా చాలా బాగుంటారు. చీరలో మిమ్ములను చూడాలని అంతా అనుకుంటారు అంటూ పోస్ట్ చేశాడు. అందుకు చిన్మయి స్పందిస్తూ.. గతంలో తాను చీరలు కట్టుకునే దాన్నే నేను అభిమానుల కోసం చీర కట్టుకుని ఉండగా ఒక కార్యక్రమంలో కొందరు నన్ను సైడ్ నుండి ఫొటోలు తీసి సాఫ్ట్ పోర్న్ సైట్స్ లో పోస్ట్ చేశారు. సైడ్ నుండి నా చెస్ట్ భాగం కనిపిస్తూ ఉన్న ఫొటోలు ఆ సైట్స్ లో పోస్ట్ చేయడంతో కొందరు ఆ ఫొటోలు చూస్తూ అసభ్యంగా( masturbating) ప్రవర్తించి వీడియోలను చిత్రీకరించుకుని అవి నాకు పంపించారు. ఆ వీడియోలు అత్యంత దారుణం. ఆ వీడియోలు నాకు పంపడంతో చీరలు కట్టుకోవడం మానేశానంటూ సమాధానం చెప్పుకొచ్చింది.సోషల్ మీడియాలో మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను షేర్ చేసుకునే చిన్మయి తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో లైంగిక వేదింపులను చెబుతూ వస్తోంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో దగ్గరగా ఉండాలనుకుంటున్న సెలబ్రెటీలకు ఈ స్థాయి వేదింపులు ఎదురవుతున్నాయి అనే విషయం చిన్మయి వ్యాఖ్యల ద్వారా వెలుగులోకి వచ్చింది. సెలబ్రెటీల పట్ల చిల్లరగా ప్రవర్తించే అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos