ఆ ఎఫెక్ట్ తో చిరు సినిమా దూరమైందా?

  • In Film
  • February 8, 2019
  • 137 Views
ఆ ఎఫెక్ట్ తో చిరు సినిమా దూరమైందా?

‘వినయ విధేయ రామ’ ఫలితం ఇంపాక్ట్ చరణ్ మీద ఏమాత్రం ఉందో తేలీదు గానీ దర్శకుడు బోయపాటి శ్రీను మీద మాత్రం ఉందనే టాక్ వినిపిస్తోంది. అలా అని ఇప్పటికిప్పుడు అయనకు నెక్స్ట్ సినిమా లేదని కాదు.  బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా నందమూరి బాలకృష్ణతో ఉంది.  అది ఖాయమే.  ఈ సినిమాకు బడ్జెట్ 70 కోట్లు కావాలని అడిగాడట బోయపాటి.  ఎక్కువ బడ్జెట్ కావడంతో ఫుల్ నేరేషన్ తర్వాత బడ్జెట్ విషయం పై ఒక నిర్ణయానికి వస్తారట. కానీ అసలు చిక్కు బాలయ్య సినిమాతో కాదు. ఆ సినిమా తర్వాత లైన్లో ఉన్న ప్రాజెక్టుతో.  గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్.  ‘సరైనోడు’ సమయంనుంచి చిరుకు బోయపాటిని సెట్ చేయాలని అయన మనసులో ఉందట.  చిరు కూడా ఒక సందర్భంలో బోయపాటి దర్శకత్వంలో చేయాలనుందని అన్నారు. కానీ ‘వినయ విధేయ రామ’ తర్వాత ఆ ప్రాజెక్ట్ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదట.  ‘వినయ విధేయ రామ’ సినిమా చూసిన అల్లు అరవింద్ డిజప్పాయింట్ అయ్యారని.. ఇలా అయితే  బోయపాటితో మెగాస్టార్ సినిమా కష్టమని ఆయన వ్యాఖ్యానించినట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.ఈ లెక్కన మెగాస్టార్ ప్రాజెక్ట్ బోయపాటికి దూరం జరిగినట్టేనని రూమర్లు గుప్పుమంటున్నాయి. ఒకవేళ గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేయలన్నా ఇప్పుడు కష్టమే. సినిమానే చేయకుండా బన్నీ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడంటేనే కథ విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థం అవుతుంది. అలాంటిది బోయపాటి మాస్ మసాలా సినిమాకు అంత సులువుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అనుకోలేం.  మరి బోయపాటి మళ్ళీ ఫామ్ లోకివస్తేనే మెగా కాంపౌండ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యేది. అలా జరగాలంటే బాలయ్య సినిమాను బ్లాక్ బస్టర్ చేయడమే బోయపాటి ముందున్న ఏకైక మార్గం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos