ఆంధ్ర అణచివేతకు కుట్ర

ఆంధ్ర అణచివేతకు కుట్ర

అమరావతి:ఆంధ్ర ప్రదేశ్‌ ప్రగతి పథంలో పయనించకుండా కుట్ర పన్నుతున్న  కేసీఆర్, మోదీ ,జగన్ లను వచ్చే ఎన్నికలలో ఎండగట్టాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు.శుక్రవారం ఇక్కడ తెదేపా నేతలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. హైదరాబాద్‌  కంటే ఎక్కువగా అమరావతి అభివృద్ధి చెందితే  తమకు మనుగడ ఉండదనేది వారి భయమన్నారు. ‘ గెలుపే లక్ష్యంగా రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ఎన్నికల ముందే కూటమి

 “ఎన్నికల ముందు కూటమి అసాధ్యం
అన్నారు. ముందగానే కూటమి ఏర్పాటు చేసాం. దీంతో  బీజేపీ నేతలకు భయం పట్టుకుంది., అందుకే కుట్రలు,
కుతంత్రాలు పెంచార”ని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని అన్ని  సమితులు తేల్చి చెప్పాయన్నారు.  అరకొర విపత్తు సాయాన్ని మొయిలీ కమిటీ నిలదీసిందని
వివరించారు. . తితలీ తుఫాను పరిహారం సగానికి తగ్గించడాన్ని ప్రశ్నించిందని చెప్పారు.
విపత్తు సాయం ఏటా 15శాతం పెంచాలని మొయిలీ  సమితి
సూచించిందని  పేర్కొన్నారు. హుద్‌హుద్‌ పరిహారం
బకాయి ఇంకా రూ.400 కోట్లు రావాల్సి ఉందన్నారు. . కేరళకు దుబాయ్‌ సాయం చేస్తానంటే కేంద్రం
అడ్డుకుందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వదని.. ఇతరులను సాయం చేయనివ్వదని
 తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos