అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…బాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎలక్షన్‌ మిషన్‌ 2019పై సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను చూసి విపక్ష నేతలకు కంటగింపు కలుగుతోందని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతి చూసి అసూయ పడుతున్నాయని చెప్పారు. ఏపీ అభివృద్ధిపైనే ప్రపంచం దృష్టి ఉందని అన్నారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఐదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి సాధించామని.. 670కి పైగా అవార్డులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఏపీపై అక్కసు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రాంతాల మధ్య చిచ్చు రగల్చాలని కుట్రలు, పన్నుతున్నారని… రాయలసీమ, ఉత్తరాంధ్ర మధ్య చిచ్చు పెట్టాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన నేతలను చంద్రబాబు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos