అరవింద అక్కడ వెనకబడిందే..!

  • In Film
  • January 25, 2019
  • 732 Views
అరవింద అక్కడ వెనకబడిందే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాస్ట్ సినిమా ‘అరవింద సమేత’ పోయినేడాది దసరా సీజన్లో విడుదలయింది. సినిమా ఫ్లాప్ అని చెప్పలేం. అలా అని ఎన్టీఆర్ రేంజ్ హిట్ కూడా కాదు. అటు త్రివిక్రమ్ స్థాయి సినిమా కూడా కాదు. ఓ మోస్తరుగా ఆడిందంతే. జీ టీవీ లో టెలికాస్ట్ అంటేనే అందరి దృష్టి టీఆర్పీల మీదే ఉంటుంది కదా.   జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ చేసిన ‘అరవింద సమేత’ ప్రిమియర్ కు 13.70 టీఆర్పీ రేటింగ్స్ సాధించింది. ఈ టీఆర్పీ రేటింగ్స్ డీసెంట్ అయినప్పటికీ ఇతర స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే మాత్రం తక్కువే.అది కూడా అర్బన్ ఏరియా రేటింగ్. యావరేజ్ (అర్బన్+రూరల్) రేటింగ్ తీసుకుంటే జస్ట్ 11.30 మాత్రమే. స్టార్ హీరోల సినిమాల టీవీ రేటింగ్స్ తో పోల్చిచూస్తే ఇది చాలా చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ టీవీ ప్రీమియర్స్ లో ‘గీత గోవిందం’ 20.51 రేటింగ్స్ లో టాప్ లో ఉండగా.. ‘రంగస్థలం’ 19.50 రేటింగ్స్ లో రెండో స్థానంలో నిలిచింది.  ‘భరత్ అనే నేను’ 14.60 రేటింగ్స్ తో మూడో స్థానం సాధించగా ‘అరవింద సమేత’ 13.70 రేటింగ్స్ తో నాలుగో స్థానంలో నిలిచింది.  2018 లో టీవీలో టెలికాస్ట్ చేసిన ఇతర స్టార్ హీరోల సినిమాలలో ‘నా పేరు సూర్య’ 12.15 రేటింగ్స్ సాధించింది. ఇదిలా ఉంటే ‘అజ్ఞాతవాసి’ మాత్రం అతి తక్కువగా 6.11 రేటింగ్ మాత్రమే సాధించింది.పూజా హెగ్డే.. ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించిన ‘అరవింద సమేత’ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.  ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తో నిరాశపడిన దర్శకుడు త్రివిక్రమ్ కు ‘అరవింద సమేత’ విజయం పెద్ద రిలీజ్ ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos