అమ్మాయిలను చంపుతా:యువకుడి పోస్ట్

  • In Crime
  • January 23, 2019
  • 723 Views
అమ్మాయిలను చంపుతా:యువకుడి పోస్ట్

తనను ప్రేమించకుండా తిరస్కరించి అమ్మాయిలపై రివేంజ్ తీర్చకుంటానని…కేవలం వారిపైనే కాదు కనిపించిన ప్రతి అమ్మాయిని హతమార్చుతానంటూ ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. అయితే మరో వారం రోజుల్లో వాషింగ్టన్ లో మహిళలతో కూడాన భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ యువకుడి పోస్ట్ ఆందోళన కలిగించింది. అయితే ముందుగానే అప్రమత్తమైన అమెరికా పోలీసులు సదరు యువకున్ని అరెస్ట్ చేయడంతో ఆ గందరగోళానికి తెరపడింది.  ఇలా తన వివాదాస్పద పేస్ బుక్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా గందగోళానికి కారణమైన యువకున్ని క్రిస్టోఫర్‌ డబ్ల్యూ క్లిరీగా గుర్తించారు. ఇతడు ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడు‘ఇంపల్స్‌ కంట్రోల్‌ డిసర్డార్‌’అనే వ్యాధితో బాధపడుతున్నట్లు… ప్రతి చిన్న  విషయానికి అతిగా ప్రవర్తించడం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఈ వ్యాధి స్వభావంగా తెలిసింది.అయితే గతకొంత కాలంగా అమ్మాయిలెవరూ తనను ప్రేమించడం క్లీరీ మనోవేధనకు గురయ్యాడు. అందువల్లే తాను ఇప్పటికీ వర్జిన్ గానే మిగిలిపోయానని  ఆవేధన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వారిపై కోపాన్ని పెంచుకుని తాను ఆత్మహత్య చేసుకునేలోపు ఎంత ఎక్కువయితే అంత మంది అమ్మాలయిలను హతమార్చాలనుకున్నాడు. ఇదే విషయాన్ని పేర్కొంటూ తన ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు.తనను రిజెక్ట్ చేసిన ప్రతి  అమ్మాయికి తగిన గుణపాఠం చెబుతానని…వారిని అతి క్రూరంగా చంపుతానన్నాడు. వారితో పాటే తనకేదురుపడ్డ ప్రతి అమ్మాయిని హతమార్చాలని ప్లాన్ చేసుకున్నానన్నాడు. ఎలాగూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నా కాబట్టి ఆ లోపు చాలామంది అమ్మాయయిలను చంపుతానంటూ  క్లిరి వివాదాస్పద ప్రకటనతో సంచలనం రేపాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి  నిందితుడిని గుర్తించారు. క్లిరీ నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 
 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos