అభినందన్ దేశానికి గర్వకారణం

అభినందన్ దేశానికి గర్వకారణం

కన్యాకుమారి:తమిళనాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ  జరిగిన భాజపా  ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అభినందన్‌ సాహసం, మొక్కవోని ధైర్యాన్ని ప్రధాని ప్రశంసించారు. గత రెండు రోజులుగా పాక్ బంధీగా ఉన్న అభినందన్‌ గురించి ప్రధాని మోదీ నేరుగా మాట్లాడటం ఇదే మొదటిసారి. భారతదేశం చాలాకాలంగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని, ఇంకెంతమాత్రం ఉపేక్షించేలేది లేదని హెచ్చరించారు. ఉగ్రవాదుల్ని శిక్షించాలని దేశం యావత్తూ మొదటి సారిగా డిమాండు చేయటం గమనార్హమన్నారు. ‘ముంబై దాడికి  ప్రతీకారంగా జరిగిందేమీ లేదు. ఉరి దాడి జరిగినప్పుడు మేము చేసినదేమిటో . అందరికీ తెలుసు. పుల్వామా దాడి జరిగినప్పుడు మన సాహస సైనికులు ఏం చేశారో కూడా చూశారు. చర్య తీసుకోవాలని వాయుసేన కోరినపుడు యూపీఏ ప్రభుత్వం మౌనాన్ని పాటించిందని వార్తలు వెలువడ్డాయి. సాయుధ బలగాలకు మేము పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అది కూడా వార్తల్లో చూశాం. ఇదే నవ భారతం ‘ అని మోదీ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos