అగ్రవర్ణాల రిజర్వేషన్లకు యోగి ప్రభుత్వం అమోదం…

లక్నో: విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అగ్ర వర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లకు యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. దీంతో గుజరాత్, జార్ఖండ్ తర్వాత కొత్త రిజర్వేషన్లకు ఆమోద ముద్రవేసిన మూడో రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఇదే వారంలో తొలిసారి గుజరాత్ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లకు పచ్చజెండా ఊపగా… ఆ మరుసటి రోజే జార్ఖండ్ సైతం వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. కాగా ఈ కోటాను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తాము ఆదేశించినట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పేర్కొన్నారు. మరోవైపు కొత్త రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నెల 20 జరగనున్న అన్ని ప్రిలిమినరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జీపీఎస్‌సీ) వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos