అంబేద్కర్‌ ఎదుట దంపతుల ధర్నా

అంబేద్కర్‌  ఎదుట దంపతుల ధర్నా

జనగామ: బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లిలో 8, 9వ వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముగ్గురి కంటే ఎక్కువ సంతానం ఉన్నా రిటర్నింగ్‌ అధికారి చర్యలు చేపట్టలేదని, వార్డుమెంబర్‌లుగా బరిలో ఉన్న దంపతులు జనగామలోని అంబేద్కర్‌ వి గ్రహం వద్ద నిరసన తెలిపారు. దంపతులు మునిగడప వర్ష- విజేందర్‌లు జిల్లా అధికారులకు తమ గ్రామపంచాయతీ వార్డుసభ్యుల నామినేషన్‌ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఫిర్యాదు పత్రాలతో ఎండలో గంట పాటు నిలబడి రిటర్నింగ్‌ అధికారి తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామపంచాయతీ క్లస్టర్‌ పడమటికేశ్వాపూర్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీహరి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారని ఆరోపించారు. 8, 9వ వార్డులలో నామినేషన్లు వేసిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులకు ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్నారని, ఈ విషయం రిటర్నింగ్‌ అధికారికి ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న రిటర్నింగ్‌ ఆఫీసర్‌పై చర్యలు చేపట్టాలన్నారు. 9వ వార్డులో బరిలో ఉన్న వర్షని ఏకగ్రీవం చేయాలని డిమాండ్‌ చేశారు. గురువారం జనగామ మండలం పెద్దతండా(వై)లో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తమను నామినేషన్‌ వేయనివ్వలేదని బాధిత మహిళల ఆందోళనలు, తాజాగా మరో రిటర్నింగ్‌ ఆఫీసర్‌పై ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos