న్యూఢిల్లీ : ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) ఆదివారం తుది శ్వాస విడిచారు. అమెరికాలో నివాసం ఉంటున్న జాకీర్ హుస్సేన్ గత 15 రోజుల నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఐసిఐలో చికిత్స పొందుతున్నారు. హృదయ సంబంధిత సమస్యలు, రక్తపోటు బాధపడుతూ ఆదివారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖ తబాలా విధ్వాంసులు ఉస్తాద్ అల్లా రఖ ఖాన్ పెద్ద కుమారుడే జాకీర్ హుస్సేన్. 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ఏడేళ్ల వయస్సు నుంచే తబాలాలో ప్రావీణ్యం సంపాదించారు. 12 ఏళ్ల వయస్సులోనే తొలి కచేరీ ఇచ్చారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్, 2023లో పద్మ విభూషణ్ అందుకున్నారు. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.