ఒంగోలు : వైకాపాలో మొన్నటి వరకు
కీలక నాయకుడుగా వ్యవహరించిన ఒంగోలు ఎంపీ వైవీ. సుబ్బారెడ్డి పార్టీ వైఖరిపై అలక
వహించినట్లు ప్రచారం జరుగుతోంది. టంగుటూరులో జరిగిన జగన్ సభకు కూడా ఆయన హాజరు
కాకపోవడం చర్చనీయాంశమైంది. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని ఈసారి మాగుంట శ్రీనివాసులు
రెడ్డికి కేటాయించారు. దీనిపై సుబ్బారెడ్డి
కినుక వహించినట్లు తెలుస్తోంది. తెదేపా నుంచి మొన్నటికి మొన్న పార్టీలోకి వచ్చిన
ఆయనకు టికెట్టును కేటాయించడమేమిటని సుబ్బారెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
తనకు తెలియకుండానే ఈ పరిణామం జరిగిపోయిందని సుబ్బారెడ్డి సైతం ఆవేదన వ్యక్తం
చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆయన విదేశాలకు వెళ్లారని ఆయనకు సన్నిహితంగా
ఉండే అనుయాయులు చెబుతున్నారు. అయితే ఆయన వర్గమంతా ఎన్నికల ప్రచారానికి దూరంగా
ఉంటోంది.