విజయవాడ: భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలుల వల్ల మంగళవానం గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాక పోకలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది. సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఇండిగో విమానం ల్యాండింగ్ కు వీలుకాక గాల్లో చక్కర్లు కొట్టింది. అందులో వైకాపా గౌరవ అధ్యక్షులు, వై.ఎస్. విజయమ్మ కూడా ఉన్నారు. విమానాన్ని నేలకుదించేందుకు పైలెట్లు శాయశక్తులా కృషి చేస్తున్నారు.