కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిది సహజమైన మరణం కాదని, ఆయన హత్యకు గురైనట్టు శవపరీక్ష నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయినట్లు పోలీసులు తెలిపారు. దేహంపై ఏడు గాయాలు ఉన్నట్లు శవపరీక్ష జరిపిన కడప రిమ్స్ ఆస్పత్రి వైద్యులు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.పదునైన ఆయుధంతో దాడి చేసినందునే ఆ గాయాలు ఏర్పడినట్లు భావిస్తున్నారు. శవ పరీక్ష తర్వాత వివేకానంద రెడ్డి భౌతిక కాయాన్ని పులివెందులకు తరలించారు. శవ పరీక్ష నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ ఆరంభించారు.
అసలేం
జరిగింది?

వైఎస్
వివేకానంద రెడ్డి నిద్రించిన పడక గది ఎయిర్ కండిషన్డ్‌ది. అయినప్మపటికీ దాని
తలుపులు ఎలా తెరచుకున్నాయి. ఎవరు తెరిచారు. తలుపు బీగాల్ని ఎవ్వరు తీసారనే కోణాల్లో
కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వివేకానంద రెడ్డి మృతిపై లోతుగా
దర్యప్తు చేస్తున్నామని కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఒక పత్రికా ప్రకటనలో
తెలిపారు. జిల్లా అదనపు పోలీసు సూపరెంటెండెంట్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు
బృందాన్ని నియమించినట్లు చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులను కూడా రప్పిస్తామన్నారు. ఇప్పటికే
ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, జాగిలాల దళం పరిశీలించాయని తెలిపారు. ఈ కేసును చాలా గంభీరంగా
తీసుకున్నామన్నారు.