ఎమ్మెల్యేనని కూడా చూడకుండా రాత్రంతా జీపులో తిప్పారు…

సర్వేల పేరుతో వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి యత్నిస్తున్నారంటూ అనుచరులతో కలసి ధర్నా చేసినందుకు పోలీసులు అరెస్ట్‌ చేసి హింసించారంటూ ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.ఓటర్ల సర్వే పేరుతో కొంతమంది యువకులు వైసీపీ సానుభూతి పరుల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం అందదడంతో యువకులను అడ్డుకొని ధర్నా చేసామన్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు తనను అరెస్ట్‌ చేసి జీపులో రాత్రంతా ఎక్కించుకొని పలుగ్రామాల్లో తిప్పారన్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి దూరంగా తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న సత్యవేడు పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించారని చెవిరెడ్డి ఫైర్ అయ్యారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే టీడీపీ తనను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. టీడీపీ పోలీసుల వైఖరిపై తాను ఈసీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పాకాలకు బైకులు, కార్లల్లో వచ్చిన కొందరు యువకులు శనివారం రాత్రి సర్వే చేపట్టారు. పాకాల మండలంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టిపట్టు ఉంది. పాకాల మండలంలో వైఎస్ఆర్ సీపీ సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఈ మండల పరిధిలో వైఎస్ఆర్ సీపీకి మెజారిటీ లభిస్తుంది. అలాంటి ప్రాంతంలో సర్వే పేరుతో వచ్చి, పార్టీ సానుభూతి పరుల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపణ. ఇప్పటికే 14వేల ఓట్లను తొలగించినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా యువకులతో దొంగ సర్వేలంటూ టీడీపీ ఓట్లను తొలగిస్తోందన్న ఆరోపణలున్నాయి. తాజాగా చంద్రగిరిలోని పాకాల మండలంలో సర్వేను చెవిరెడ్డి అడ్డుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos