ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త విషయం వెలుగు చూసింది.వైఎస్ వివేకాది సుపారీ హత్యకు కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ నిర్ధారించింది.కడప జిల్లా ప్రొద్దూటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ వైయస్ వివేకాను హత్య చేసినట్లుగా సిట్ తేల్చింది.వివేకా హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన సిట్ అందులో భాగంగా సుమారు 800 మందిని విచారించారు.ఈ క్రమంలో నిందితులకు శ్రీనివాసరెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా సిట్ అధికారులు నిర్ధారించారు.నిందితులు వాడిన బైక్ ఆధారంగా ఈ కేసు కొలిక్కి తెచ్చే ప్రయత్నం మొదలైంది.కొద్ది రోజుల క్రితం ఇదే శ్రీనివాసరెడ్డి అనుమానాస్పదంగా మరణించారు. దీంతో మరింత అనుమానాలు బలపడ్డాయి. అసలు ఎవరి కోసం శ్రీనివాసరెడ్డి ఈ సుపారీ ఇచ్చారనే అంశం తేల్చే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు.