హొసూరు : ఇక్కడికి సమీపంలోని బాగలూరులో ఆస్తి తగాదాల వల్ల యువకుడు కత్తి పోట్లకు గురయ్యాడు. బాగలూరు కోట వీధికి చెందిన మునియప్ప, అతని అన్న కొడుకు వేణుల మధ్య గత కొద్ది రోజులుగా ఆస్తి తగాదాలున్నాయి. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. వేణు బుధవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా మునియప్ప వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో గాయపడిన వేణును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.