లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ డాలీగంజ్ లో ఒక వంతెన
పై ఎండు
ఫలాల్ని అమ్ముకుంటున్న ఇద్దరు కశ్మీరీ యువకుల్ని గురువారం ఉదయం కాషాయ రంగు దుస్తుల్ని
ధరించిన కొందరు కర్రలతో చావ బాధినట్లు
పోలీసులు తెలిపారు. యువకులపై దాడి జరుగు తున్నపుడు అప్రమత్తమైన చుట్టుపక్కల ఉన్న
వారు కాషాయ దుస్తుల్ని ధరించిన వారిని తరిమి వేసి కశ్మీరి యువకుల్ని కాపాడారు. తదుపరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హసన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో
ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాడి చేసిన వారిలో సోన్‌కార్ అనే వ్యక్తిని అరెస్టు చేసా మన్నారు. తాను విశ్వ హిందూ దళ్ అధ్యక్షుడినని ఆ వ్యక్తి తమతో చెప్పినట్లు తెలిపారు. గుర్తింపు కార్డులను చూపించాలని కశ్మీరీలపై దాడి చేసిన వ్యక్తులు డిమాండ్ చేసినపుడు ఆ యువకులు తమ సామగ్రిని సర్దుకుని అక్కడి నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నించినపుడు
కర్రలతో దాడికి పాల్పడ్డారు. కొందరు ఈ ఘటన ఫొటోల్ని
కూడా తీసారు. వాటినీ పోలీసులు పరిశీలించారు. బాధితులు ఇద్దరూ చాలా ఏళ్లుగా ఉత్తర ప్రదేశ్‌లో ఎండు ఫలాల్ని అమ్మి జీవిక
సాగిస్తున్నారు.