రోగులకు సేవలందిస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ నేతపై దర్యాప్తు

రోగులకు సేవలందిస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ నేతపై దర్యాప్తు

న్యూ ఢిల్లీ: కరోనా బాధితులకు ఇక్కడ విస్తృతంగా సేవలందిస్తున్న అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ను పోలీసులు ప్రశ్నించారు. కొవిడ్ మందులను కొన్ని రాజకీయపార్టీల నేతలు చట్టవిరుద్ధంగా పంపిణీ చేస్తున్నారని పేర్కొంటూ దిల్లీ హైకోర్టులో దాఖలైన కేసు ఆధారంగా శ్రీనివాస్ను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని మే 4న దిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ పిటిషన్లో ఎక్కడా శ్రీనివాస్ పేరు లేకపోయినా క్రైమ్బ్రాంచ్ పోలీసులు వచ్చారని.. ఆయన చెప్పిన సమాధానాలను నమోదు చేసుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. పోలీసులకు భయపడి తాము ఇప్పటివరకు చేస్తున్న సేవను ఆపబోమని శ్రీనివాస్ ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos