గోడలెక్కిన యోగి, మౌర్య

గోడలెక్కిన యోగి, మౌర్య

లఖ్నవ్: నగరంలో పోస్టర్ల యుద్ధం తీవ్రమైంది. లక్నోలో సీఏఏ వ్యతిరేక హింసా కాండలో ప్రమేయమున్న వారి ఫోటోలు, చిరునామాలతో హోర్డింగ్లు ఏర్పాటు చేసిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎదురు దెబ్బ తీసింది. అల్లర్లను ప్రోత్సహించింది, రెచ్చగొట్టింది వీరేనంటూ యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు భాజపా నేతల ఫోటోల పోస్టర్లను నగర మంతటా కాంగ్రెస్ కార్యకర్తలు అతికించారు. వారిద్దరూ ఎన్నికల్లో పోటీచేసినప్పుడు అఫిడవిట్లో పేర్కొన్న పలు క్రిమినల్ కేసులను కూడా ఈ పోస్టర్లలో పొందు పరిచారు. యోగి ఆదిత్యనాథ్పై అల్లర్లు, ప్రార్థనా స్థలాల విధ్వంసం, హత్యారోపణలతో సహా ఐదు కేసులు ఉండగా, కేశవ్ ప్రసాద్ మౌర్యపై 11 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. సంజయ్ బల్యాన్, రాథా మోహన్ దాస్ అగర్వాల్, సురేష్ రైనా, సంగీత్ సోమ్, ఉమేష్ మాలిక్, సాధ్వి ప్రాచి సహా పలువురు పేరున్న కమలనాధుల ఫోటోలు కూడా పోస్టర్లలో ఉన్నాయి. వీరిపైనా ఉన్న అల్లర్ల ఆరోపణలను ప్రస్తావించారు. అల్లర్లు, ప్రార్థనా స్థలాల విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి ఎందుకు వసూలు చేయలేదని కూడా సర్కార్ను కాంగ్రెస్ పార్టీ నిలదీసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos