నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించి భూ స్థాపితం చేస్తామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు భరోసా వ్యక్తీకరించారు.సోమవారం నెల్లూరులో జరిగిన తెదేపా ఎన్నికల సన్నాహ సభలో ప్రసంగించారు. ఒకప్పుడు తన మంత్రి వర్గ సభ్యుడైన కేసీఆర్ తననే తిడుతున్నారని, ఆయన ఏమైనా నింగి నుంచి ఊడి పడ్డారాని మండి పడ్డారు. సంక్షేమ కార్యక్రమాల్ని తెలంగాణ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశామన్నారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశలోకి అడుగు పెట్టలేక పోయినం దునే కాల్మొక్కుతా అనే జగన్‌ను ద్వారా తెర వెనుక రాజకీయాలు చేయదలచారని ఆరోపించారు. ఇందుకోసం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు ధనపు రాశుల్ని కూడా పంపనున్నారని చెప్పారు. కేసీఆర్ ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించారన్నారు. ‘తెలంగాణలో ఇతర రాజకీయ పక్షాల్లేకుండా చేసిన కెసిఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాడికి దిగాలనుకుంటున్నారు. నా బొందెలో ఉన్నంత వరకు మీ ఆటలు సాగవని’ హెచ్చరించారు. వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యను ఎందుకు దాచిపెట్టి గుండె పోటుగా చిత్రీకరించారని జగన్‌ను ప్రశ్నించారు. వివేకా హత్య ఇంటి దొంగల పనిగా ప్రజలు అనుకుంటున్నారు. హత్య తర్వాత ఆధారాలు లేకుండా చేశారని, హత్యను జగన్ దాచి పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గతంలో తెదేపా నేత పరిటాల రవిని పార్టీ కార్యాలయంలోనే దారుణంగా హత్య చేశారని, వై.ఎస్. రాజశేఖర రెడ్డి పరిపాలనలో వందలాదిగా మంది తెదేపా చంపారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దొంగలకు కాపలా కాస్తారని వ్యాఖ్యానించారు. 11 కేసుల్లో తొలి, మలి ముద్దాయిలు ప్రధాని కార్యాలయంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.