ఆడియో రూపంలో సీపీఎం ప్రణాళిక

న్యూ ఢిల్లీ: దేశంలోనే మొదటి సారిగా ఆడియో రూపంలోని సీపీఎం ఎన్నికల ప్రణాళికను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏచూరి విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్లలో ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల చాలా ఇబ్బంది పడ్డారని విమర్శించారు. ప్రజల బ్రతుకు దెరువుపై దాడులు జరిగాయని, గతంలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. భాజపా పాలనలో ధనిక, పేదల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువైందన్నారు. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. సీపీఎం ద్వారా మాత్రమే ప్రత్యామ్నాయ విధానాలు సాధ్యమ వుతుందని ఎన్నికలప్రణాళికలో విపులీకరించామన్నారు. రైతులకు 50 శాతం సాధారణ సహాయం కూడా అందిస్తామని తెలిపారు. రాష్ట్ర సమితిలు ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికల్ని విడుదల చేస్తాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే లౌకికవాద ప్రభుత్వం రావాలని, ఆ లౌకిక వాద ప్రభుత్వంలో కమ్యునిస్టులు ఉండాలనేది ప్రణాళికలో ప్రధాన అంశమన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos