
విజయవాడ: మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విధానం ఉండదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. దేశంలో 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం ఇప్పడు తాండవిస్తోందని ఆందోళన చెందారు. సోమవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలో మతోన్మాదం పెరిగిందని, ఆర్థిక విధానం దెబ్బ తిన్నదని విమర్శించారు. మోదీ పాలనలో వ్యవసాయం కుంటుపడి ఎంతో మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తీకరించారు. 2014లో తేదెపా, భాజపాల కలయికతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, వైకాపాలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశించారు.