అర్థనగ్న ప్రదర్శన-శిరోముండనంతో దళిత నేత నిరసన

అర్థనగ్న ప్రదర్శన-శిరోముండనంతో దళిత నేత నిరసన

విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్, వైసిపి దళిత నాయకుడు నందేపు జగదీష్ అర్థనగ్న ప్రదర్శనతో శిరోముండనం చేయించుకొని సోమవారం తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగదీష్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు గుండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసిపి తరఫున ప్రచారం చేశానన్న కోపంతో తనకు చెందిన భవనాన్ని జెసిపిల సాయంతో బోండా ఉమా అతని అనుచరుల సమక్షంలో అధికారులు కూల్చివేశారని చెప్పారు. అందుకే అర్థనగ్న ప్రదర్శనతో శిరోముండనం చేయించుకొని నిరసన తెలిపానన్నారు. ఈక్రమంలో నందిపు జగదీష్ తన భార్యకు కూడా శిరోముండనం చేయించబోతుండగా పోలీసులు అడ్డుకొని నివారించారు. జగదీష్ మాట్లాడుతూ గతంలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ భవనం ప్రారంభోత్సవం అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేశారని గుర్తు చేశారు. తాను ఎన్నికల్లో వైసిపి తరఫున ప్రచారం చేశానని అసూయతో భవనాన్ని కూల్చివేశారని ధ్వజమెత్తారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత సిఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తానని జగదీష్ ప్రకటించారు. దళిత వైసిపి నాయకుడిగా ఉండటం తాను చేసిన తప్పా ? అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరగకపోతే తాను చేసుకున్న శిరోముండనంతో పాటు తన కుటుంబ సభ్యులకి కూడా శిరోముండనం చేయించి ఆందోళనను తీవ్రతరం చేస్తానని జగదీష్ హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos