అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ తొలివిడత ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 3249 స్థానాల్లో ఎన్నికలకు నిర్వహించారు. అత్యధిక స్థానాల్లో వైకాపా విజయకేతనాన్ని ఎగురవేసింది. మొత్తం 3249ల్లో వైకాపా 2347 పంచాయతీలను దక్కించుకుంది. తెదేపా 564 స్థానాలను, బిజెపి, జనసేన లు 46 స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఇతరులు 292 స్థానాలలో గెలుపొందారు.