అమరావతి:ప్రభుత్వ కార్యాలయాల వేసిన వైకాపా రంగుల్ని తొలగించాలని ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం మంగళ వారం ఆదేశించింది. ముఖ్య కార్యదర్శి నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ కొత్త రంగులు వేయాలని సూచించింది . తమ ఆదేశాలు అమలును ఆధారాలతో నివేదించాలని ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ ఆదేశాల్ని జారీ చేసింది.