ముంబై: ఎస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు తమ బ్యాంకు పాలక మండలి అంగీకరించినందున నెల రోజల్లో ఎస్ బ్యాంకు పరిస్థితిని చక్కదిద్దుతామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం ఇక్కడ ప్రకటించారు. ఇందు కోసం తాము 24 గంటలూ పని చేస్తామన్నారు. ‘ఖాతాదారుల నగదు భద్రంగా ఉంటుంది. ఆందోళన చెందొద్దు. బ్యాంకు పునర్నిర్మాణ ముసాయిదా చేరింది. తొలి దశలో రూ.2450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాం. తుది నిర్ణయాలను రెగ్యు లేటరీలకు అందిస్తాం. మూడేళ్ల వ్యవధిలో ఏడాదికి రూ.5500 కోట్ల పెట్టుబడి ఉంటుంది. మార్చి 9 లోపు తమ ప్రతిపాదనలను ఆర్బీఐ ముందు ఉంచుతామ’ని విశదీకరించారు.