న్యూ ఢిల్లీ:జస్టిస్ యశ్వంత్ వర్మకు సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం తిరస్కరించింది. త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేసిన జస్టిస్ యశ్వంత్ శర్మ సవాల్ చేశారు. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో జస్టిస్ వర్మపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతర్జగత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చి.. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. అయితే, కమిటీ దర్యాప్తు నివేదికను ఆయన సవాల్ చేశారు. పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. జస్టిస్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని కలిగించదని.. ఆయన పిటిషన్‌ను విచారణకు పరిగణలోకి తీసుకోకూడదని ధర్మాసనం పేర్కొంది.