ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు పురస్కరించుకొని యశోధాబెన్ పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కళ్యాణేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కళ్యాణేశ్వరీ ఆలయంలో రూ. 201లతో యశోధాబెన్ ప్రత్యేక పూజ నిర్వహించినట్టుగా ఆలయవర్గాలు తెలిపాయి. ఇదే ప్రాంగణంలో ఉన్న శివుడి ఆలయానికి అభిషేకం చేసి రూ. 101 లను దక్షిణగా ఇచ్చారు.శుభాంకర్ దియోగార్గియా, బిల్ట్ ముఖర్జీయాలు యశోధా బెన్ కు పూజ నిర్వహించారు.ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ధన్బాధ్ లో యశోధాబెన్ చిన్న పిల్లల విద్య కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.యశోధాబెన్ ఈ ఆలయాన్ని సందర్శించిన సమయంలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ రాలేదని సమాచారం. స్థానిక ఎమ్మెల్యే మహతితో పాటు ఆయన భార్య సాబిత్రిదేవీతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు మాత్రం యశోధాబెన్కు స్వాగతం పలికారు.