మైన‌ర్ బాలిక‌ను య‌డ్యూర‌ప్ప వేధించారు.. 750 పేజీల ఛార్జ్‌షీట్‌లో సీఐడీ వెల్ల‌డి

మైన‌ర్ బాలిక‌ను య‌డ్యూర‌ప్ప వేధించారు.. 750 పేజీల ఛార్జ్‌షీట్‌లో సీఐడీ వెల్ల‌డి

బెంగుళూరు: బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప మైనర్ బాలికను తన ఇంట్లో లైంగికంగా వేధించినట్లు సీఐడీ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది. వేధింపులకు చెందిన 750 పేజీల ఛార్జ్షీట్ను సీఐడీ గురువారం రిలీజ్ చేసింది. 17 ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో యడ్యూరప్పతో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. తన కూతురిపై యడ్డీ వేధింపులకు పాల్పడినట్లు ఆ అమ్మాయి తల్లి ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ఫేస్బుక్ అకౌంట్లో ఓ వీడియోను అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే. 2024, ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 11.15 నిమిషాలకు బాధిత మైనర్ తన తల్లితో కలిసి యడ్యూరప్ప ఇంటికి వెళ్లారు. బెంగుళూరులోని డాలర్స్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లారు. లైంగిక దాడి కేసులో సాయం కోరేందుకు వాళ్లు మాజీ సీఎం ఇంటికి వెళ్లారు. తల్లితో మాట్లాడుతూనే యడ్యూరప్ప బాధితురాలి చేయిని పట్టుకున్నట్లు సీఐడీ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది. ఆ తర్వాత మైనర్ అమ్మాయిని మరో రూమ్లోకి పిలిపించి గతంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటన గురించి అడిగినట్లు తెలుస్తోంది. బాధితురాలి వయసు తెలుసుకున్న యడ్డీ ఆ తర్వాత లైంగికంగా వేధించే ప్రయత్నం చేసినట్లు సీఐడీ రిపోర్టులో పేర్కొన్నారు. మాజీ సీఎం చేయిని తోసేసిన బాధితురాలు.. రూమ్ నుంచి బయటకు పారిపోయింది. బాధితురాలి తల్లికి యడ్డీ డబ్బులు ఇచ్చినట్లు ఛార్జ్షీట్లో రాశారు. ఫిబ్రవరి 20వ తేదీన బాధితురాలి తల్లి వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత .. ఈ కేసులో నిందితులుగా ఉన్న అరుణ్, రుద్రేశ్, మారిస్వామిలు.. బాధితురాలిని, ఆమె తల్లిని కలిసే ప్రయత్నం చేశారు. యడ్యూరప్ప ఇంటికి బాధితురాలిని, ఆమె తల్లిని తీసుకెళ్లిన వాళ్లు.. ఐఫోన్ గ్యాలరీ నుంచి ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియోను డిలీట్ చేయించారు. యడ్యూరప్ప ఆదేశాల ప్రకారం బాధితులకు రెండు లక్షలు చెల్లించారు.యడ్యూరప్పపై పోక్సోలోని సెక్షన్ 8 కింద కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 354ఏ, 204, 214 కింద కూడా ఫిర్యాదు నమోదు చేశారు. మిగితా ముగ్గురు నిందితులపై ఐపీసీ 204, 214 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos