మాట మార్చిన యడియూరప్ప

మాట మార్చిన యడియూరప్ప

మంగళూరు : నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సాగిన ఆందోళన సందర్భంగా జరిపిన పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరికి పరిహారం చెల్లింపుపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం మాట మార్చారు. మృతుల కుటుంబాలకు చెరి రూ.లక్ష వంతున పరిహారాన్ని చెల్లిస్తామని గతంలో ప్రకటించారు. మృతులిద్దరూ ముస్లింలే కావటం గమనార్హం. సిఐడి విచా రణ తరువాతే పరిహారం చెల్లింపు గురించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామని బుధవారం మాట మార్చారు. మృతులు అల్లర్ల లో పాల్గొన్నారని విచారణలో వెల్లడైతే వారి కుటుంబాలకు ఎలాంటి పరిహారం ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos