న్యూఢిల్లీ :పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యల్ని తీసుకోవాలని వివిధ రాజకీయనేతలు,క్రీడా కారులు, సినీ నటులు, మాధ్యమ సంస్థలకువిన్నవిస్తూ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వరుస ట్వీట్లకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజవాది పార్టీ అధినేత అభిలేష్ యాదవ్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ‘అవును. మోదీ నిజం చెప్పారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రధాని కోరుతు న్నట్లు వారిలో పరివర్తన వస్తుంది. మా ఆలోచన అదే. మోదీ ఆలోచన కూడా మా ఆలోచన లాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటే అది అధికార పార్టీని గద్దె దించేందుకు దోహదపడుతుంది. ప్రధాని ఆకాంక్షిస్తున్నట్టు ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునివ్వబోతున్నారు.’ అని అఖిలేష్‌స్పందించారు.