సామాజిక మాధ్యమాలు
కత్తికి రెండువైపులా పదునున్న ఆయుధాలని తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసిన దారుణ ఘటన
ద్వారా మరోసారి రుజువైంది.ఫేస్‌బుక్,వాట్సాప్‌ల ద్వారా 20 ఏళ్ల లోపు యువతులను పరిచయం
చేసుకొని పథకం ప్రకారం ట్రాప్ చేసి అత్యాచారాలు చేసి వీడియోలు తీసి యువతులను బెదిరించి
డబ్బులు,నగలు తీసుకోవడంతో పాటు అనేకసార్లు అత్యాచారాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు
అరెస్ట్ చేశారు.తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా పొలాచ్చికి చెందిన తిరునావుక్కరసు
అనే యువకుడు కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినితో ఫేస్‌బుక్‌లో
పరిచయం పెంచుకున్నాడు.ఇద్దరి మధ్య స్నేహం బలపడిన అనంతరం తన స్నేహితులను పరిచయం చేస్తానని
నమ్మించి తన స్నేహితులతో కలసి యువతిని కారులో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం
చేశాడు.ఈ తతంగాన్ని మొబైల్‌లో వీడియో తీసి తాము అడిడినపుడు లైంగిక వాంఛ తీర్చడంతో పాటు
డబ్బులు, నగలు ఇవ్వాలని లేదంటే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తామంటూ
బెదిరించారు.అయితే బాలిక ఈ విషయాన్ని తల్లితండ్రులకు తెలపడంతో కేసు నమోదు చేసుకొని
విచారణ చేపట్టిన పోలీసులకు అనేక విస్తుపోయే విషయాలు తెలిశాయి.తిరునావుక్కరసుతో పాటు
శబరి,వసంతకుమార్,సతీశ్‌కుమార్‌లను మరింత లోతుగా విచారణ చేసిన పోలీసులు నిందితులు
200 మందికి పైగా అమ్మాయిలను ట్రాప్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకున్న విషయం వెలుగులోకి
వచ్చింది.బాధితులంతా పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు చెందిన యువతులేనని బాధితులంతా 20ఏళ్ల
లోపు యువతులేనని పోలీసులు తెలిపారు.ఈ వ్యవహారంలో సెంథిల్, బాబు, నాగరాజ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు.నిందితుల్లో నాగరాజు అనే
యువకుడు అధికార అన్నా డీఎంకే పార్టీకి చెందిన పొల్లాచ్చి శాఖ యువ నాయకుడని
పోలీసులు తెలిపారు.దీనిపై అధికార,ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం,రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
వ్యక్తం కావడంతో పొల్లాచ్చి సంఘటనతో సంబంధం ఉన్న నాగరాజ్‌ను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే అధిష్ఠానం ప్రకటించింది.ఈ వ్యవహారంలో తమిళ చిత్ర పరిశ్రమ ఒక హీరోతో పాటు మరికొందరు తమిళ సినీ
ప్రముఖులు కూడా సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..