మహిళ ప్రాణం తీసిన వేడివేడి బజ్జీలు..

మహిళ ప్రాణం తీసిన వేడివేడి బజ్జీలు..

వేడివేడి బజ్జీలు మహిళ ప్రాణం తీశాయి.చెన్నై నగరానికి చెందిన పద్మావతి(45) కొద్ది కాలంగా పుట్టింట్లో తల్లి పద్మావతితో కలసి ఉంటోంది.ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పద్మావతి తల్లి ఇంట్లో బోండాలు,బజ్జీలు చేసింది.అదే సమయంలో బోండాలు,బజ్జీల కోసం వంటగదిలోకి వెళ్లిన పద్మావతి వేడివేడిగా ఉన్న బోండాలు,బజ్జీలను ఆతృతగా వేగంగా తినేసింది.అయితే మిరపకాయ బజ్జీలను కొరకకుండా తినేయడంతో అవి గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో విలవిల్లాడుతూ పద్మావతి అక్కడే కుప్పకూలింది.గమనించిన పద్మావతి తల్లి స్థానికుల సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే పద్మావతి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.వేగంగా తినడం వల్లే పద్మావతి మృతి చెందినట్లు వైద్యులు తెలపగా బజ్జీలు తింటే మృతి చెందడమేంటని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.కాగా కుటుంబ కలహాలతో భర్త గంగాధర్‌ నుంచి విడిపోయిన పద్మావతి పుట్టింట్లో ఉంటోంది..
 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos